ధనుష్ సినిమాలో కాజోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెళ్లాయిల్లా పట్టాదారి’ సినిమాతో సంచలన విజయం సాధించాడు హీరో ధనుష్. ఆ సినిమా ‘రఘువరన్’గా తెలుగులో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘విఐపి 2’ పేరుతో చిత్రాన్ని రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రెట్టీ గర్ల్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తుందట!! పెళ్లి చేసుకుని కొంత గ్యాప్ తీసుకున్న కాజోల్ లేటెస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. షారుఖ్ సరసన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’. ‘దిల్వాలే’ సినిమాల్లో నటించింది. దాంతోపాటు సౌత్‌లో కూడా సినిమాలు చేయాలనే ప్లాన్‌లో భాగంగా ఈ సినిమాకు ఓకే చెప్పింది. సౌందర్య ఇటీవలే కాజోల్‌ను కలిసి ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి చెప్పిందట. పాత్ర బాగా నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో అమలాపాల్, మంజిమ మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధనుష్ మరదలు సౌందర్య దర్శకత్వం వహించే ఈ సినిమాతో.. కాజోల్ సౌత్‌లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి!