బాబీకే చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జనతా గ్యారేజ్’ విడుదలై అప్పుడే మూడునెలలు గడిచిపోయాయి. ఇంతవరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా ఇంకా ఓకే చెయ్యలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథ చర్చలు జరిపిన ఆయన తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఆయన ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్వత్రా ఆసక్తినెలకొన్న ఈ సినిమా విషయంలో ఫైనల్‌గా ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆయన నటించే కొత్త సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తాడట. ఇటీవలే బాబీ చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పాడని సమాచారం. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తాడని, ఈనెల 10న సినిమా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబీ, ఆ తరువాత పవన్‌కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని చేసాడు. ఆ సినిమా అనుకున్న విజయం సాధించకపోవడంతో బాబీ తన తదుపరి సినిమా విషయంలో గట్టి ప్రయత్నాలే చేసాడు. ఫైనల్‌గా ఎన్టీఆర్‌తో ఆయన సినిమా ఓకే అయింది.