మోహన్‌లాల్ కనుపాప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. మలయాళంలో 50 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ చిత్రాన్ని కనుపాపగా అందిస్తున్నామని నిర్మాత దిలీప్‌కుమార్ బోలుగోటి తెలిపారు. ఇంకా ఆయన చిత్ర విశేషాలు తెలుపుతూ, మోహన్‌లాల్ అంధుడిగా నటించాడని, ఓ అపార్ట్‌మెంట్‌లో లిప్ట్ ఆపరేటర్‌గా పనిచేసే ఆయన సమక్షంలోనే ఓ హత్య జరుగుతుందని, ఆ హంతకుడు తప్పించుకుంటే అతన్ని అంధుడైన మోహన్‌లాల్ ఎలా పట్టుకున్నాడు అనే కథనంతో ఈ చిత్రం హారర్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని తెలిపారు. మనమంతా, ‘జనతాగ్యారేజ్’ చిత్రాల విజయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో అంచనాలు బాగా పెరిగాయని, ఓవర్‌సీస్ నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని తెలిపారు. తెలుగులో విడుదలవుతున్న కనుపాప చిత్రంలో తాను వైవిధ్యమైన పాత్రలో నటించే ప్రయత్నం చేశానని, క్రిస్మస్ కానుకగా ఈ నెలాఖరున ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోందని తెలిపారు. ‘ఒప్పమ్’ చిత్రం మలయాళంలో ఎంత విజయవంతమైందో, ‘కనుపాప’ సినిమా కూడా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని మోహన్‌లాల్ తెలిపారు. ఈ చిత్రానికి తానే సమర్పకుడిగా వ్యవహరిస్తున్నానని, ఈనెల రెండో వారంలో ఆడియోను, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.