తప్పుదిద్దుకునేలా చేసిన ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోషన్, ఆర్తీ జంటగా సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై అళహరి దర్శకత్వంలో విశ్వాస్.హెచ్. రూపొందించిన చిత్రం ‘ప్లస్ ఒన్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- స్వీట్ 16 వయసును దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కించామని, ప్రేమలేని ప్రేమకథ ఒకవైపు, మరోవైపు ప్రేమ వున్న కథతో రెండు కథనాలతో ఈ చిత్రం వైవిధ్యంగా సాగుతుందని, తెలియక చేసిన పొరపాటువల్ల తప్పుని ఒప్పుగా చేసుకోవడానికి ఓ జంట ఏం చేసింది అని వినూత్నమైన కథనంతో ఈ చిత్రం రూపొందించామని, యువతకు తల్లిదండ్రులకు తప్పక నచ్చుతుందని తెలిపారు. యువత ఆలోచనలకు దగ్గరగా ఈ సినిమా రూపొందించామని, ప్లస్ ఒన్ ఏజ్‌లో యువత శారీరకంగా, మానసికంగా ఎలా వుంటారు అనే అంశాలు ఇందులో చర్చించామని, సినిమా అంతా నల్గొండలో పూర్తిచేశామని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తామని నిర్మాత విశ్వాస్.హెచ్ అన్నారు.