దెయ్యం వుంటే భయమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. విడుదల కావలసిన ఈ చిత్రాన్ని పరిశ్రమలో నెలకొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావంతో వాయిదా వేశామని, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అల్లరి నరేష్ కెరీర్‌లోనే ఓ వైవిధ్యమైన పాత్రలో నటించారని, హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మొదటినుండి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుందని, వౌర్యని, కృతిక హీరోయిన్ల నటన గ్లామర్ ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటాయని, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటించారని, సినిమా తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని తెలిపారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, చలపతిరావు, కాదంబరి కిరణ్, ధన్‌రాజ్, ప్రగతి, రజిత, అమిత్, టార్జాన్, జయవాణి, అపూర్వ, ఆజాద్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్, కెమెరా: దాశరథి సివేంద్ర, మాటలు: డైమండ్ రత్నం, పాటలు: భాస్కర భట్ల, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.