కోటిలింగాలలో శాతకర్ణి ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈనెల 16న వంద థియేటర్లలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా టీజర్‌ను కరీంనగర్‌లోని కోటిలింగాలు పుణ్యక్షేత్రంలో బాలకృష్ణ విడుదల చేస్తారట. త్వరలోనే తిరుపతిలో పాటలను విడుదల చేసి జనవరి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని ముఖ్యపాత్ర పోషిస్తోంది. శాతకర్ణి జీవిత కథ ఆధారంగా చారిత్రాత్మక అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ ఫైట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని అంటున్నారు.