రాత్రికి రాత్రే స్టార్‌ని కాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతున్న నటి ఎవరంటే.. అందరు చెప్పే పేరు రకుల్‌ప్రీత్‌సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో సక్సెస్ జర్నీ ప్రారంభమైన రకుల్ ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ, వరుస విజయాలతో ముందుంది. మెగా హీరో రామ్‌చరణ్ సరసన రకుల్ నటించిన ‘్ధృవ’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ ముఖాముఖి మాట్లాడారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే..

‘్ధృవ’తో హిట్ అందుకున్నారు.. ఎలా వుంది?
- చాలా హ్యాపీగా వుంది. గీతా ఆర్ట్స్ సంస్థ, సురేందర్ రెడ్డి దర్శకత్వం, రామ్‌చరణ్ పక్కన చేసిన సినిమా తొలి షో నుంచే ఇంత పెద్ద హిట్ టాక్‌తో నడవడం చాలా సంతోషంగా అనిపించింది.
* చరణ్‌తో రెండోసారి ఛాన్స్ వస్తుందనుకున్నారా?
- అసలు అనుకోలేదు. ఈ సినిమా కోసం నన్ను అడగడం నిజంగా ఎయిత్ వండర్ అనిపించింది. కానీ సినిమా జయాపజయాలను నటీనటులు నిర్ణయిస్తారా? హిందీలో షారుఖ్, కాజోల్‌ని హిట్ పెయిర్ అంటారు. అలాగని వారు చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయా? సినిమా సక్సెస్‌ని నిర్ణయించే పండితులం మేమే అయితే ప్రతి సినిమానూ సక్సెస్ చేసుకుంటాం కదా. ‘కిక్-2’ బాగా ఆడకపోయినప్పటికీ సురేందర్ రెడ్డి నామీద నమ్మకంతో ఈ సినిమా ఇచ్చారు.
* దర్శకుడు సురేందర్ రెడ్డితో కూడా ఇది మీకు రెండో సినిమా కదా?
- అవును. వరుస సినిమాలు చేయడంవల్ల బేసిగ్గా కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి. ఒకసారి పనిచేసిన తర్వాత వారి ప్రవర్తన మనకు తెలుస్తుంది. చాలామంది దర్శకులు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాని ఒకసారి చేసిన తర్వాత వారేం చెప్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. నిర్మాణ సంస్థ దగ్గర నుంచి సురేందర్ రెడ్డి, రామ్‌చరణ్ వరకు అందరితోనూ ఇంతకుముదు పనిచేశాను. వాళ్ళతో మరోసారి చేయడం హ్యాపీగా అనిపించింది.
* ‘్ధృవ’ ఒరిజినల్ తనిఒరువన్ చూశారా?
- విడుదలైనప్పుడే చూశాను. ఏ సినిమా అయినా విడుదల కాగానే చూస్తాను. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్రాలు.
* ఈ సినిమాలో ఓ పాట కోసం
డైట్ చేశారని తెలిసింది?
- ఆ పాటకోసం అందరూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. అలాగే నేను కూడా నా వంతు శ్రద్ధ తీసుకున్నాను. మనం మామూలుగా తిన్నా, నీళ్లు తాగినా పొట్ట కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండేలా ఈ పాట కోసం జాగ్రత్త తీసుకున్నాను. ఉదయం 9.30 నుంచి సాయంత్రం వరకు నీళ్లుకూడా తాగేదాన్ని కాదు. ఎప్పుడైనా మరీ దాహంగా అన్పిస్తే నోరు తడుపుకునేదాన్ని. నీరసంగా వుంటే పుచ్చకాయ ముక్కలు ఒకటో, రెండో తినేదాన్ని. అలా నాలుగు రోజులు చేశాను. షూటింగ్ పూర్తవగానే రకుల్‌కి ఫుడ్ పెట్టండి అంటూ అందరూ చాలా కేర్ తీసుకునేవారు.
*‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు.. మరి ఈ సినిమాకు చెప్పలేదు, కారణం?
- నేను చెబుదామనే అనుకున్నా. సూరి కూడా చెప్పమనే అన్నారు. కానీ నేను చాలా బిజీగా ఉన్నాను. ఒక రోజు ఒక చోట ఉంటే, ఇంకో రోజు ఇంకెక్కడో ఉండేదాన్ని. నా పరిస్థితిని అర్థం చేసుకున్న అల్లు అరవింద్ ఫర్వాలేదు అని వేరేవాళ్లతో చెప్పించారు.
* తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్నారు కదా, మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
- మీకు అలా అన్పిస్తోందా? నేనేం ఓవర్‌నైట్ స్టార్‌ని కాలేదు. స్టార్‌ని కావడానికి చాన్నాళ్లే పట్టిందనిపిస్తోంది. అయినా నేను షూటింగ్ పూర్తయితే రకుల్‌గానే ఉంటాను. ఆరు తర్వాత సరిగా తల కూడా దువ్వుకోను. కానీ బయటకు వచ్చేటప్పుడు ఓ నటిగా సిద్ధం కాక తప్పదు. కాబట్టి రెడీ అవుతుంటాను.
* తెలుగు బాగా మాట్లాడుతున్నారు?
- తెలుగు నేర్చుకోవడం కాదు.. తెలుగులోనే ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను పూర్తిగా తెలుగమ్మాయిని అయిపోయా.
* మీ సోదరుడు హీరోగా వస్తున్నాడా?
- తను తెలుగు నేర్చుకుంటున్నాడు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* ఫలానా దర్శకుడితో పనిచేయాలనే కోరిక, అలాగే డ్రీమ్ పాత్రలు ఉన్నాయా
- రాజవౌళిగారితో చేయాలని ఉంది. ఆయన పిలిస్తే అలా వెళ్లిపోతానంతే. పూర్తి స్థాయి రొమాంటిక్ చిత్రం చేయాలని ఉంది. మణిరత్నంగారి ‘ఓకె బంగారం’ తరహాలో.
* నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటి?
- ప్రస్తుతం మహేశ్ చిత్రంలో నటిస్తున్నా. అలాగే కార్తితో ఓ సినిమా, నాగచైతన్యతో ఓ చిత్రం, సాయిధరమ్‌తేజ్ సినిమా.. ఇలా ఐదారు చిత్రాలున్నాయి.

-శ్రీ