అబ్దుల్ కలాం మిసైల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య బాలీవుడ్‌లో బయోపిక్ చిత్రాల హవా బాగా పెరిగిపోయింది. ఇప్పటికే నిజ జీవిత కథలతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకాదరణ అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాల్ని నమోదు చేసుకుంటున్నాయి. ఇక తెలుగులో బయోపిక్ చిత్రాలు రావడం అరుదే. తాజాగా ఈ తరహా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత అనీల్ సుంకర. భారత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహాలు ముమ్మరం చేశాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఇంగ్లీషులో తెరకెక్కిస్తారట. డ్రీమ్ మర్చంట్ బ్యానర్‌లో నిర్మితమయ్యే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తారట. అబ్దుల్ కలాం జీవితచరిత్రపై వచ్చిన రచనలు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని, దాంతోపాటు ఆయన జీవితానికి సంబంధించిన అంశాలపై రీసెర్చి చేసి కథను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి, భారత రాష్టప్రతివరకు ఎదిగిన ఆయన జీవితం, అందులో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా చిత్రం వుంటుందట. ఈ చిత్రానికి డాక్టర్ అబ్దుల్ కలాం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మిసైల్ మాన్‌గా పేరుతెచ్చుకున్న కలాం సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తారట.