ఇకపై వరుసగా సినిమాలు తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని ప్రయత్నంలో ‘లవ్‌లీ’ సినిమా తరువాత కాస్త గ్యాప్ వచ్చింది. ఇకపై రెగ్యులర్‌గా ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తానని అంటున్నాడు నిర్మాత బి.ఏ.రాజు. ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘లవ్‌లీ’ వంటి సినిమాల తరువాత ఆయన నిర్మించే చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈరోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు...
కొత్త తారలతో వైశాఖం
‘లవ్‌లీ’ సినిమా తరువాత మా బ్యానర్ నుండి రాబోతున్న చిత్రం ‘వైశాఖం’. కొత్త నటీనటులతో తెరకెక్కే ఈ చిత్రం ఈనెల 18న ప్రారంభం అవుతుంది. సరికొత్త పాయింట్‌తో తెరకెక్కే ఈ చిత్రం చూసే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జయ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా అన్ని రకాల కమర్షియల్ హంగులతో రూపొందిస్తాం.
సినిమా తీయడం సులువుకాదు
‘సినిమా చూడ్డానికి రెండు గంటల సమయం పట్టవచ్చు. కానీ సినిమా తీయడం చాలా కష్టాలతో కూడుకున్న పని. నేను, బి.జయ దర్శకత్వంలోనే సినిమాలు తీయాలని ఈ బ్యానర్‌ను ప్రారంభించాం. చేసిన సినిమాలు మంచి ప్రజాదరణ పొందడంతో ఇటీవలే వచ్చిన ‘లవ్‌లీ’ చిత్రం ఘనవిజయం సాధించింది. దర్శకురాలిగా జయకు మంచి గుర్తింపునిచ్చింది. ఈ సినిమా హిందీలో డబ్ చేశారు. అలాగే బెంగాలీ భాషలో రీమేక్ చేశారు. నేను పరిశ్రమకు వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. సూపర్‌హిట్ పత్రికను విజయవంతంగా నడిపిస్తూనే మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యానర్‌ను స్థాపించాం. అయితే ఇతర బ్యానర్లతో కలిసి సినిమాలు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు మా బ్యానర్‌లో కొత్త ఐడియాలతో వచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తా’ అంటూ ముగించారు.