బాలకృష్ణ 100వ సినిమా ఆదిత్య 999?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో 99వ చిత్రంగా తెరకెక్కింది. ఇప్పుడు బాలకృష్ణ 100వ సినిమాపై అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం బోయపాటి శ్రీను అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మరో సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణ 100వ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించే అవకాశం లేనట్టేనని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ వందో సినిమాకు ఓకె చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని అంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణకు కథ చెప్పారని, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొంది సంచలన విజయం సాధించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తారని తెలుస్తోంది. ‘ఆదిత్య 999’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారి వివరాలు వెల్లడేయ్య అవకాశం వుంది.