నా కనుపాప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్, ప్రియదర్శన్ కలయికలో మళయాలంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఒప్పమ్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంచలనం సృష్టించిన ‘ఒప్పమ్’ ఇప్పటివరకు 50 కోట్లు వసూలు చేసింది. ఒప్పమ్ కథ విషయానికి వస్తే- ఇందులో మోహన్‌లాల్ అంధుడిగా నటించారు. మోహన్‌లాల్ ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ఆపరేటర్. ఒక రోజు ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ హత్య చేసి హంతకుడు తప్పించుకుంటాడు. అంధుడైన హీరో ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అనేది కథ. దీన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపించినా, ఆ హక్కులు ఎవరికీ ఇవ్వకుండా కనుపాప పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మనమంతా, జనతా గ్యారేజ్ చిత్రాల విజయాలతో మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో కనుపాపపై టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. మోహన్‌లాల్ కనుపాప చిత్రంతో తెలుగులో హ్యాట్రిక్ సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఓవర్‌సీస్ నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్ బి.దిలీప్‌కుమార్‌తో కలిసి మోహన్‌లాల్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ- ‘నిర్మాత దిలీప్ కుమార్ బొలుగోటి ఒప్పమ్ తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నారు. ఈనెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ అనువాద చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
నిర్మాత దిలీప్‌కుమార్ బొలుగోటి మాట్లాడుతూ- ‘ ఈ సినిమాకు మోహన్‌లాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులోనూ ఇది ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం:ప్రియదర్శన్.