వదంతులు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామగా తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది మలయాళ కుట్టి అమలా పాల్. ‘మైన’తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ నాలుగైదు సినిమాలకే స్టార్ హీరోలతో జోడీ కట్టింది. అంతే త్వరగా పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు సినిమాకు దూరం అయిన ఈమె భర్త విజయ్‌కి బ్రేక్‌అప్ చెప్పింది. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన అమలకు వరుస అవకాశాలు క్యూ కట్టేశాయి. ఆ ఆనందంలో ఉండగానే హీరో ధనుష్‌తో ఎఫైర్ నడిపిస్తుందంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. భర్త నుంచి విడిపోయిన తరువాత ‘అమ్మ కనుక్కు’ లాంటి సినిమాతో ఆమెకు సపోర్టు ఇచ్చాడు ధనుష్. ఆ తరువాత ‘వడా చెన్నై’, ‘విఐపి’ చిత్రాల్లో నటించింది. దాంతో వీరిద్దరిమధ్య ఏదో వ్యవహారం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే క్లారిటీ ఇస్తే బెటర్ అని ఫీల్ అయినట్టుంది అమల. ‘నా విడాకుల న్యూస్ తెలిసి.. నాకు ధనుష్‌కు మధ్య ఎఫైర్ ఉన్నట్టు వార్తలు రావడం దారుణం. నాకు ధనుష్ చాలా సహాయం చేశాడు. సినిమాలు కలిసి చేసినంత మాత్రాన మా మధ్య ఏదో ఉందని అనడం కరెక్ట్ కాదు. ఈ వార్తలు నిజం కావు. సమాజంలో మహిళలను టార్గెట్ చేయడం సర్వసాధారణమే కదా’ అంటూ స్పందించింది.