హీరోలు సత్తా చూపించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా తెలుగు హీరోలు సత్తా చాటడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. స్టార్ హీరోలు ఇంకాస్త ఇమేజ్ పెంచుకోవడం, చిన్న హీరోలు పెద్ద హీరోలుగా మారడానికి చేసే ప్రయత్నాలు ఎలా వర్కవుట్ అయ్యాయో చూస్తే- 2016లో మన హీరోలు కాస్త స్పీడ్ పెంచారు. ఏడాదికి ఒక్క సినిమా చేసే స్టార్ హీరోలు ఈ ఏడాది రెండు, మూడు సినిమాలను లైన్‌లో పెట్టి సక్సెస్ అందుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్నానాయనా’తో హిట్ కొట్టాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనాన్ని బాగా ఎంటర్‌టైన్ చేసింది. మార్చిలో ‘ఊపిరి’తో నాగ్ మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో నాగ్ సినిమా మొత్తం కదలకుండా వీల్‌చెయిర్‌లో కూర్చుని వైవిధ్య భరితంగా నటించాడు. నాగార్జున ఇలాంటి ప్రయోగం చేయడం సాహసమనే చెప్పాలి. ఈ ఏడాది రెండు వరుస విజయాలతో నాగార్జున మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో నాగ్ నటిస్తున్నాడు.
ఈ ఏడాది రెండు హిట్‌లతో జోరు పెంచాడు ఎన్టీఆర్. సంక్రాంతి కానుకగా ‘నాన్నకు ప్రేమతో’ బోణీ కొట్టాడు. వరుస పరాజయాలతో సతమతమైన ఈ నటుడికి గత ఏడాది ‘టెంపర్’ కాస్త ఉత్సాహాన్ని అందించగా, ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుని 50 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’తో మరో హిట్‌ను అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ సంచలన విజయం సాధించి టాలీవుడ్‌లో మూడో బ్లాక్‌బస్టర్‌గా బాక్సాఫీస్ వద్ద నిలబడింది.
ఈ ఏడాది మంచి విజయంతో జోరుని ప్రదర్శించాడు హీరో నితిన్. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’తో మర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. నితిన్ గత సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమాతో నితిన్ 50 కోట్ల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకున్నాడు. ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో రామ్. అంతకుముందు వరుస ఫ్లాపులను చవిచూసిన ఈ కుర్ర హీరోకు ‘నేను శైలజ’ మంచి ఊపునిచ్చింది. ఆ తరువాత ‘హైపర్’ కూడా విజయాన్ని అందుకుంది. సాయిధరమ్ తేజ్ సుప్రీం సినిమాతో హిట్ అందుకున్నాడు. యువహీరో నాని ఈ ఏడాది మూడు సినిమాలతో వచ్చి ‘హ్యాట్రిక్’ హిట్లు కొట్టాడు. నాని గత ఏడాది ‘్భలే భలే మగాడివోయ్’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టి, ఈ ఏడాది ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’తో బోణి కొట్టాడు. యాక్షన్ ఫ్యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన దీన్ని విభిన్నంగా మలిచాడు హను రాఘవపూడి. దీని తరువాత ‘జెంటిల్‌మాన్’తో కూడా నాని సూపర్‌హిట్ నమోదు చేసుకున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్‌మూవీలో నాని డ్యూయల్ రోల్ అందరినీ ఆకట్టుకుంటుంది. నాని చేసిన మరో వెరైటీ లవ్‌స్టోరీ ‘మజ్ను’. ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కూడా నాని చెప్పుకోదగ్గ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ఏడాది శర్వానంద్ సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో హిట్ కొట్టాడు. తరువాత ‘రాజాధిరాజా’తో ఫ్లాప్‌ను అందుకున్నాడు. నారా రోహిత్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో దండయాత్ర చేశాడు. ‘తుంటరి’తో బోణీకొట్టినా, అది ఏవరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఆ తరువాత ‘సావిత్రి’, ‘రాజా చెయ్యివేస్తే’ యావరేజ్‌గా నిలిచాయి. తర్వాత ‘జ్యో అచ్చుతానంద’తో హిట్ కొట్టేశాడు రోహిత్. శ్రీనివాస్ అవసరాల మలిచిన ఈ రొమాంటిక్ కామెడీ నారా రోహిత్‌కి ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. ‘శంకర’తో ఫ్లాప్ అందుకున్న రోహిత్ ఈ ఏడాది చివర్లో భిన్నమైన కథతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అంటూ వచ్చాడు. ఇక, కాస్త గ్యాప్ తీసుకున్న సునీల్ ‘కృష్ణాష్టమి’తో హిట్ కొట్టాలని యత్నించినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత విడుదలైన ‘జక్కన్న’ అదే రీతిలో బోల్తా కొట్టింది. ఇక లాభం లేదనుకుని ‘ఈడు గోల్డ్ ఎహే’ అంటూ డ్యూయెల్ రోల్ చేసినా ఓటమి తప్పలేదు. ప్రస్తుతం సునీల్ క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ‘ఉంగరాల రాంబాబు’ చేస్తున్నాడు.
ఈ ఏడాది మంచు విష్ణు ఆడోరకం ఈడోరకం సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. రాజ్ తరుణ్‌కు ఈ సక్సెస్‌లో భాగం ఉంది. గత ఏడాది కుమారి 21ఎఫ్‌తో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న రాజ్‌తరుణ్ ఈ సంవత్సరం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రంతో ఫ్లాప్‌ను చవిచూశాడు. రాజ్ తరుణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. కుక్కల్ని కిడ్నాప్ చేసే ఓ వెరైటీ పాత్రలో ఆయన నటిస్తున్నాడు. మరో యువహీరో సందీప్ కిషన్ ఈ సంవత్సరం రన్ అనే రీమేక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ, మలయాళంలో సూపర్‌హిట్ అయిన నేరం అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా తెలుగులో అంతగా విజయవంతం కాలేదు. ఆ తరువాత వచ్చిన థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ ఒక్కమ్మాయి జనానికి సరైన కిక్ ఇవ్వలేదు. ప్రస్తుతం కృష్ణవంశీ రూపొందిస్తున్న ‘నక్షత్రం’లో నటిస్తున్నాడు. మొత్తానికి ఈ ఏడాది యువ హీరోలకు పరిశ్రమ మంచి విజయాలనే అందించింది. కొందరు కలెక్షన్ల వర్షం కురిపించుకుంటే, మరికొందరు యావరేజ్ హిట్స్‌తో సరిపెట్టుకున్నారు.

-శ్రీ