కాటమరాయుడి దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో శరత్‌మరార్ రూపొందిస్తున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారాన్ని దూకుడుగా నిర్వహిస్తున్నామని నిర్మాత తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే ప్రచారం వినూత్న రీతిలో ప్రారంభించామని, అంచెలంచెలుగా ప్రచార చిత్రాలను విడుదల చేశామని తెలిపారు. సంక్రాంతి కానుకగా కాటమరాయుడు టీజర్ విడుదల చేస్తామని, షూటింగ్ దాదాపుగా పూర్తికావచ్చిందని అన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నామని, ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలీ, నాజర్, రావురమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్‌కామరాజు, చైతన్యకృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్‌రావత్, పవిత్రలోకేష్, రజిత, యామినీ భాస్కర్, అశ్మిత, రమాదేవి, భానుశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, నిర్మాత: శరత్‌మరార్, దర్శకత్వం: కిషోర్ పార్ధాసాని.