సావిత్రిగా కీర్తి సురేష్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రిపై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా రెండు మూడు నెలలుగా వినిపిస్తున్న వార్త. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసినట్లు నాగ్ అశ్విన్ ప్రకటించారు. అయితే సావిత్రి పాత్రలో ఎవరు నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. ఆ పాత్రను నిత్యామీనన్, విద్యాబాలన్, సమంతలు నటించనున్నారని పుకార్లు వెల్లువెత్తాయి. చివరికి ఎవరిని వరించని ఆ అదృష్టం పరిశ్రమలో ప్రామిసింగ్ హీరోయిన్‌గా ఎదుగుతున్న కీర్తి సురేష్‌ని వరించింది. ఆ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోనున్నదని దర్శకుడు నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే ఈ చిత్రంలో నటించడానికి కీర్తి సురేష్ ఒప్పుకున్నట్లు సమాచారం. సావిత్రి సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్‌విఆర్, గుమ్మడి, జెమినీ గణేశన్, ఎంజిఆర్‌ల పాత్రలను ఎవరు పోషించనున్నారనేదే మరో ప్రశ్నగా మిగిలింది. అయితే ఆయా పాత్రల్లో ఆయా నటుల వారసులనే ఎంపిక చేసే ప్రయత్నాల్లో దర్శకుడు వున్నారట. మొత్తానికి సావిత్రిగా మెప్పించడానికి సురేష్ సిద్ధమైనట్లే అన్నమాట!