దంగల్-2లో సోనాక్షి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీర్‌ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ నటన అద్భుతమని చెప్పాలి. మల్లయోధుడు మహావీర్ పోగత్, ఆయన కుమార్తెలు గీత, బబిత జీవిత విశేషాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రెండు వారాల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా మహావీర్‌సింగ్ పోగత్ మూడో కుమార్తె రీతు పోగత్ స్పందిస్తూ,‘2020లో ఒలింపిక్స్‌లో ఎవరైనా స్వర్ణపతాకం సాధిస్తారో వాళ్లమీద కచ్చితంగా దంగల్-2 సినిమా చేస్తారని నాన్న చెప్పారు. ఆ సినిమాలో రెజ్లర్‌గా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటిస్తే బాగుంటుందని, ఎందుకంటే ఆమె రెజ్లర్‌గా సరిగ్గా సరిపోతుందని, కథకు కచ్చితంగా న్యాయం చేయగలదు’ అని చెప్పింది. దంగల్ సినిమాకు సీక్వెల్ వస్తే మాత్రం సోనాక్షి హీరోయిన్‌గా నటిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ విషయం వింటే సోనాక్షి ఎలా స్పందిస్తుందో చూడాలి!