23న ‘శివలింగ’ టీజర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్ళై తెరకెక్కిస్తున్న చిత్రం ‘శివలింగ’. రితిక హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన కన్నడ సూపర్‌హిట్ మూవీ శివలింగ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. జనవరి 23న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- కథే హీరోగా కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన చిత్రం శివలింగ. పి.వాసు చంద్రముఖి, లారెన్స్ కాంచన, గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హర్రర్ ఎంటర్‌టైనర్‌గా శివలింగ తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీజర్‌ను జనవరి 23న, సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాఘవ లారెన్స్, రితిక సింగ్, వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి:సర్వేష్ మురారి, మ్యూజిక్:ఎస్.ఎస్.తమన్, సాహిత్యం:రామజోగయ్య శాస్ర్తీ, ఆర్ట్:దురైరాజ్, ఫైట్స్:అనల్ అరసు, దినేష్, ఎడిటింగ్:సురేష్, నిర్మాత:రమేష్ పి.పిళ్లై.