శ్రీవిష్ణు కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు. బాబా క్రియేషన్స్ పతాకంపై బెల్లాన అప్పారావు రూపొందించే ఈ చిత్రానికి దర్శకుడు ఇంద్రసేన.ఆర్. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు మాట్లాడుతూ, భిన్నమైన కథతో పాశ్చాత్య ధోరణిలో ఈ చిత్రం సాగుతుందని, సినిమాలో మూడు కథలు సమాంతరంగా సాగుతుంటాయని, వీటిలోని రహస్యాన్ని ఛేదించడమే కథానాయకుడి ఉద్దేశమని, రోలర్ కాస్ట్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:సతీష్ రఘునాధన్, దర్శకత్వం:ఇంద్రసేన.ఆర్., నిర్మాత:అప్పారావు బెల్లాన.