ప్రేమభిక్ష పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓమ్ శ్రీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ప్రేమభిక్ష. అనీల్‌కుమార్, శ్రుతిలయ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ- ‘అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో 1970లో జరిగిన యధార్థ ఘటనను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఆసక్తికరంగా సాగే స్క్రీన్‌ప్లేతోపాటు మంచి సంభాషణలు వున్నాయ’ని తెలిపారు. భద్రపట్నంలో 70 శాతం షూటింగ్ చేశామని, మిగతా భాగం కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో చేశామని, త్వరలో ఆడియోను విడుదల చేస్తామన్నారు. అనీల్‌కుమార్, సుమన్, షఫి, జీవా, కవిత, సుమన్‌శెట్టి, రాజేంద్ర, గోపికర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఘంటాడి కృష్ణ, కెమెరా:ప్రమోద్.ఆర్., పాటలు:రామ్‌పైడిశెట్టి, నిర్మాతలు:ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు, కథ, మాటలు, దర్శకత్వం:ఆర్.కె.గాంధి.