ఎక్కడా తగ్గడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ భామ మలైకా అరోరా వ్యవహారం మాంచి జోరుమీదుంది. ఇప్పటికే ఈమెపై రకరకాల వార్తలు బాలీవుడ్‌లో జోరుగా షికారు చేస్తున్నాయి. భర్త అర్బాజ్‌ఖాన్‌తో విడాకుల వ్యవహారం, పార్టీల్లో తాగేసి నానా హంగామా చేయడం వంటివి రోజురోజుకూ కొత్తకొత్తగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈమె మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందుకనే హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తూ బికినీల్లో రకరకాల ఫొటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ నానా హంగామా చేస్తోంది. మలైకా పెడుతున్న ఫొటోలను చూసి షాక్ అవుతున్నారు జనాలు. లేటు వయసులో ఈ ఘాటు అందాలు ఏమిటా? అని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అయినా సరే- బికినీలు, హాట్ హాట్ డ్రెస్సులతో మళ్లీ తన క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకునేందుకు గట్టిగానే ట్రైచేస్తోంది. తెలుగులో గబ్బర్‌సింగ్‌లో ‘కెవ్వు కేక’ అంటూ ఐటెమ్ సాంగ్‌తో అలరించిన ఈమె, మరోవైపు ఐటెమ్ సాంగ్స్ చేయడానికి కూడా తెగ ఆసక్తి చూపిస్తోందట. మరి మలైకా గ్లామర్ అందాలకు కొత్త అవకాశాలు వస్తాయేమో చూడాలి!