ప్రయత్నాలు ఫలిస్తాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐశ్వర్యా రాయ్ పోలికలతో వుందని బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన అందాల భామ స్నేహా ఉల్లాల్‌కు ఆ తరువాత కెరీర్ ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. తెలుగులోకి ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినా, అవి ఆమెను హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయి. గ్లామర్ హంగులతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. ఆమధ్య అల్లరి నరేష్ హీగా వచ్చిన యాక్షన్ 3డి సినిమా తరువాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించని ఈమె తాజాగా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గ్లామర్ డోస్‌తో రకరకాల ఫొటోలకు ఫోజులిస్తూ హంగామా చేస్తోంది. ఇప్పటికే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మొత్తానికి గ్లామర్ డోస్ పెంచానని చెప్పకనే చెబుతున్న స్నేహకు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు వస్తాయేమో చూడాలి! అయినా ఇన్నాళ్లూ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా, ఈ కొత్త ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.