స్పీడు పెంచిన మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా తమిళ క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే అహ్మదాబాద్, ముంబాయి, హైదరాబాద్‌లలో జరిగిన షెడ్యూల్స్‌తో చాలావరకూ షూటింగ్ పూర్తయింది. నేటినుండి ముంబాయిలో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. కీలకమైన యాక్షన్ సన్నివేశాలతోపాటు హీరో హీరోయిన్లకు సంబంధించిన సీన్లు కూడా చిత్రీకరిస్తారని, ఆ తరువాత బ్యాంకాక్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుందని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో మహేష్ ఫ్యాన్స్‌లో ఆసక్తి ఎక్కువైంది. త్వరలోనే టైటిల్‌తో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తారట. మహేష్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపిస్తాడట.