ఎన్టీఆర్ సినిమాలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనతా గ్యారేజ్ తరువాత బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు ఎన్టీఆర్. ప్రీ ప్రొడక్షన్ పనులు,స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి రానుంది. నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ విషయం పక్కనపెడితే, ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్లామర్ భామ లక్ష్మీరాయ్‌ని ఎంపిక చేస్తారట. ఇటీవలే చిరంజీవి నటించిన ఖైదీ నెం.150లో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకున్న లక్ష్మీరాయ్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఆ తరహా సాంగ్ చేస్తుందట. పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో లక్ష్మీరాయ్‌ని ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణం దర్శకుడు బాబీ. బాబీ, పవన్‌తో చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో లక్ష్మీరాయ్ ఐటెం సాంగ్ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికే ఈ అమ్మడిపై దృష్టి సారించారట. అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నట్టు తెలిసింది.