కోలీవుడ్‌లోకి సోగ్గాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరోలకు ఉన్నంత ఫోకస్ ఎందుకో తెలుగు హీరోలకు ఉండదు? తమిళ హీరోలు తెలుగు బాక్సాఫీస్‌పై దుమ్ము రేపుతూ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సినిమాను ప్రమోట్ చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ నుండి నిన్న మొన్న వచ్చిన రెమో హీరో వరకు తెలుగులో కూడా ఇమేజ్ తెచ్చుకోవాలని ట్రై చేసినవారే. కానీ మన హీరోలకు టాలీవుడ్ ఒక్కటే చాలన్నట్టు ప్రవర్తిస్తారు. అందుకే సంచలన విజయాలు సాధించిన సినిమాలను కూడా కనీసం తమిళంలో డబ్ చేయడానికి ఆసక్తి చూపరు. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సోగ్గాడే చిన్నినాయన సినిమా ఇప్పుడు తమిళంలోకి వెళుతోంది. నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని నాగార్జునను యాభై కోట్ల క్లబ్‌లో చేర్చింది. ఈ సినిమా విడుదలై ఏడాది దాటుతున్న సమయంలో తమిళంలోకి డబ్ చేయాలనే ఆలోచన వచ్చినట్లుంది. ‘సొక్కాలి మైనర్’ పేరుతో తమిళంలో విడుదల కానుంది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిసింది.