3న కనుపాప విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్‌లో రూపొందిన క్రైం థ్రిల్లర్ చిత్రం కనుపాప. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేయడం విశేషం. దిలీప్‌కుమార్ బొలుగేటి తెలుగులో అందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడదల చేయనున్నారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ- అంధుడిగా మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం వైవిధ్యమైన కథనంతో సాగుతుందని, ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన నేరం నుండి హంతకుడు తప్పించుకుంటే, అంధుడైన హీరో అతనిని ఎలా పట్టుకున్నాడనే ఆసక్తికరమైన కథనంతో సాగుతుందని తెలిపారు. కనుపాప సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయని, మలయాళంలోకన్నా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం:ప్రియదర్శన్.