9న వస్తున్న సింగం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు సూర్య, అనుష్క, శృతిహాసన్ ముఖ్య పాత్రల్లో హరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన భారీ చిత్రం సింగం-3. జనవరి 26న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనుకోని కారణాలవలన వాయిదా పడుతూ ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమైంది. ముఖ్యంగా తమిళనాడులో జల్లికట్టుకు సంబంధించిన ఆందోళనలు జరిగిన నేపథ్యంలో చిత్రాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 3న విడుదల చేయాలనుకున్నారు కానీ, 9 అయితే బెటర్ అని భావించిన యూనిట్ ఆ డేట్‌న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది. సూర్య, హరిల కాంబినేషన్‌లో వచ్చిన సింగం-1, సింగం-2 చిత్రాలు సంచలన విజయం సాధించిన నేపథ్యంలో సింగం-3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివకుమార్ నిర్మిస్తున్నారు.