ఎంతవరకు ఈ ప్రేమ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రంగం’ వంటి సూపర్‌హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్ ‘కవలై వేండాం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ‘యామిరుక్క బయమేన్’ ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్‌హిట్ చిత్రంలో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కలయికలో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎంతవరకు ఈ ప్రేమ’. అవుటండ్ అవుట్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు డీకే సినిమాను అద్భుతంగా రూపొందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన పాటలకు తెలుగు, తమిళంలో మంచి స్పందన వచ్చిందన్నారు.