డీజే ఫస్ట్‌లుక్ వస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, దర్శకుడు హరీష్‌శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘డీజే’- దువ్వాడ జగన్నాథం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఎక్కడా భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుండగా, ఫస్ట్‌లుక్, విడుదల తేదీల విషయమై సమాచారం అందింది. మొదట ఫస్ట్‌లుక్ రెడీ అయ్యాక, ఫస్ట్‌లుక్‌కు ఒక తేదీ నిర్ణయించి, ఆ తర్వాతే విడుదల తేదీని ప్రకటిస్తారట. ఈ ఫస్ట్‌లుక్ త్వరలోనే విడుదలవుతుందని తెలిపిన టీమ్ ఎప్పుడన్నది మాత్రం స్పష్టం చేయలేదు. హరీష్ శంకర్ స్టైల్లోనే యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న ‘డీజే’కు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.