జవాన్‌గా సాయిధరమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘జవాన్’. సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, ప్రసన్న కీలక పాత్రదారులు. ఈ సినిమాను కృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్రం గురించి రాజు మాట్లాడుతూ,‘కథ చాలా బాగా కుదిరింది. కృషణ్‌ని నిర్మాతని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. అతనికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఇది మిలిటరీ కథ కాదు’ అని అన్నారు. బీవీయస్ రవి మాట్లాడుతూ ‘‘జవాన్ అనగానే అందరూ ఇది జవాన్ల కథ అనుకుంటారు. కానీ మా కథ అది కాదు. మధ్యతరగతి యువకుడి కథ. కుటుంబానికి ఓ కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఓ కుర్రాడు ఉండాలి. మా హీరో అలాంటి వ్యక్తి. ఇంటికొకడు అనేది మా సినిమాకు క్యాప్షన్. దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో, ప్రతి ఇంటికి ఇలాంటి ఒక కుర్రాడు ముఖ్యం. పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా ఇది. థమన్ మంచి సంగీతాన్నిచ్చారు. మార్చి నుండి షూటింగ్ ప్రారంభిస్తాం’ అన్నారు. సాయిధరమ్‌తేజ్ మాట్లాడుతూ ‘రాజు సపోర్ట్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. రవి, కృషణ్ కాంబినేషన్‌లో చేస్తున్నాను. మంచి కథ, డిఫరెంట్ కానె్సప్ట్ చిత్రం. ఎంటర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో థమన్ గుహన్ తదితరులు పాల్గొన్నారు. కెమెరా: కె.వి.గుహన్, సంగీతం: యస్.యస్.్థమన్, ఆర్ట్: బరహ్మ కడలి, ఎడిటింగ్: యస్.ఆర్.శేఖర్, సహ రచయితలు: కల్యాణ్‌వర్మ దండు, సాయికృషణ్, వంశీ బలపనూరి.