సెన్సార్‌కు చంద్రుళ్లో ఉండే కుందేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై అర్జున్, క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, కోయల్‌దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’. వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా సెన్సార్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా వెంకటరెడ్డి ఉసిరిక మాట్లాడుతూ, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం
నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసకుని సెన్సార్‌కు సిద్ధమైందని తెలిపారు. నటీనటులంతా చక్కగా నటించారని, సంగీతం హైలైట్‌గా ఉంటుందని, కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని తెలిపారు. సెన్సార్ పూర్తయ్యాక విడుదల తేదీని ప్రకటిస్తారు. పావనిరెడ్డి, పమేల, కీ.శే.రంగనాథ్, సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, సప్తగిరి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, పాటలు:శ్రీమణి, కరుణాకర్ అడిగర్ల, ఫైట్స్:విజయ్, జాషువా, రాంబాబు, డ్యాన్స్:స్వర్ణ, నిక్సన్, కిరణ్, రాజు, సంగీతం:విజయ్ గోర్తి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి:దాము నర్రావుల, నిర్మాతలు:్ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి, దర్శకత్వం:వెంకటరెడ్డి ఉసిరిక.