ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకుని బాబీ సినిమాకి ఒప్పుకున్నాడు. నటుడు కళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రారంభోత్సవం జరుపుకుని, 15వ తేదీన రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతుంది. ఈ చిత్రంలో తారక్ సరసన హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో కళ్యాణ్‌రామ్ మరో ప్రకటన చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశీఖన్నా నటించనుందట. ఈ చిత్రంలో మరొక హీరోయిన్ కూడా నటిస్తుందని, సినిమాకు ‘జై లవకుశ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. వీటిపై కూడా త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సినిమాటోగ్రాఫర్ సి.కె.మురళీధరన్ పనిచేయనుండటం మరో విశేషం.