నీలంపాటి అమ్మోరు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్యామ్, శ్రీకీర్తిక, సుమన్ ప్రధాన తారాగణంగా నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో జరిగింది. శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని నటుడు సుమన్‌కు అందించారు. ఈ సందర్భంగా తోట కృష్ణ మాట్లాడుతూ- కొత్తవాళ్ళను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఎందరికో ఉపాధిని కల్పిస్తున్న చిన్న సినిమాలకు వినోదపు పన్ను మినహాయిస్తే బాగుంటుందని తెలిపారు. సుమన్ నటించిన ఈ భక్తిరస చిత్రం ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని అన్నారు. తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించానని, ఈ చిత్రంలో అమ్మవారి భక్తుడిగా ఓ ఛాలెంజ్ పాత్రలో నటించడం తనకు తృప్తి కలిగించిందని నటుడు సుమన్ తెలిపారు. 700 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలో జరిగిన నీలంపాటి అమ్మవారి జీవిత కథ మహిమలతో ఈ సినిమా రూపొందించామని దర్శక, నిర్మాత తోట కృష్ణ తెలిపారు. త్వరలో విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఘనశ్యామ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరోయిన్ కీర్తిక, బేబి వైష్ణవి, శ్రీలత పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి పాటలు:వెలిగండ్ల శ్రీరామమూర్తి, పిస్కా రవీందర్, చుక్కా వినె్సంట్‌పాల్, మాటలు:సతీష్ బండోజీ, కెమెరా:ఆనంద్, ఎడిటింగ్:కళ్యాణ్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:తోట కృష్ణ.