హారర్ థ్రిల్లర్ చిత్రాంగద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి ప్రధాన పాత్రలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చిత్రాంగద’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని వైవిధ్యమైన కథనంతో ఈ చిత్రం రూపొందిందని, హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో రూపొందించిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ప్రేక్షకులకు ట్విస్ట్‌లు, షాక్‌లు ఇస్తుందని తెలిపారు. అంజలి పాడిన పాట సినిమాకు హైలైట్‌గా వుంటుందని, కొన్ని అదృశ్య శక్తుల కారణంగా కథానాయిక జీవితం ఎలాంటి చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగద ఏం చేసింది అన్న కథనంతో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందించామన్నారు. కథానుగుణంగా అమెరికాలో చిత్రీకరించామని తెలిపారు. జె.పి.సప్తగిరి, రాజా రవీంద్ర, సింధు తులాని, రక్ష, దీపక్, సాక్షి గులాటి, సుధీర్, జ్యోతి తదితరులు నటించారు.