సరసుడు హ్యాట్రిక్ అవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరసుడు’. నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ హీరోయిన్లుగా దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మించిన చిత్రం ‘సరసుడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. చాలాకాలం గ్యాప్ తర్వాత శింబు, నయనతార క్రేజీ కాంబినేషన్‌లో తమిళ, తెలుగు భాషల్లో తెలుగు నేటివిటికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘సరసుడు’ (ఎ లవర్ బోయ్) పేరుతో అతి త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు శింబు తమ్ముడు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఆడియోను సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేస్తున్నారు. ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత ‘ప్రేమసాగరం’ టి.రాజేందర్ ఈ చిత్రానికి మాటలు, పాటల్ని రాయడం విశేషం. ఫిబ్రవరి 3న హీరో శింబు జన్మదినం సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత టి.రాజేందర్ తెలియజేస్తూ, ‘ఐటి రంగంలో పనిచేసే యువతీ యువకులు ఎలా లవ్ చేసుకుంటున్నారు? ఎలా విడిపోతున్నారు? చివరికి వారి ప్రేమ పెళ్లిదాకా వస్తుందా? లేదా? అనే అంశాలతో ఈ చిత్రం వుంటుంది. నేటి యువతకు కనెక్ట్ అయ్యే విధంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. తెలుగుకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14న ఆడియో రిలీజ్ చేసి, త్వరలో సినిమా విడుదల చేస్తాం.’ అన్నారు. ఆండ్రియా, ఆదాశర్మ, సత్యం రాజేష్, సూరి, సంతానం, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత:టి.రాజేందర్, సంగీతం:టి.ఆర్.కురళ్ అరసన్, కెమెరా:బాలసుబ్రహ్మణయం, ఎడిటింగ్:ప్రవీణ్, ప్రదీప్, నిర్మాత:టి.రాజేందర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండిరాజ్.