లారెన్స్‌తో మళ్లీ లక్ష్మీరాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కమర్షియల్ దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నాడు. ఆమధ్య కాంచన సినిమాలో హీరోయిన్‌గా లక్ష్మీరాయ్‌తో చిందేసినప్పటినుండి లారెన్స్ ఆమెను వదిలేలా కనిపించడం లేదు. ఇటీవలే మెగాస్టార్ నటించిన ఖైదీ నెం 150వ సినిమాలో లారెన్స్ డాన్స్‌మాస్టర్‌గా ఓ పాటను కంపోజ్ చేశాడు. ఐతే ఆ సాంగ్‌లో వేరే హీరోయిన్స్ నటిస్తారని చాలా వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళందరినీ కాదని లక్ష్మీరాయ్‌ని ఎంపిక చేశారు. తాజాగా లారెన్స్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ‘మెట్ట శివ కెట్ట శివ’ సినిమాలో కూడా ఐటెం సాంగ్‌లో లక్ష్మీరాయ్ చేసింది. నిజానికి ఆ సాంగ్‌లో ముమైత్‌ఖాన్ చేయాల్సి ఉంది. ఆ ఛాన్సును లక్ష్మీరాయ్‌కి ఇచ్చాడు. ఈమధ్య లక్ష్మీరాయ్ ఐటెం సాంగ్స్‌తో మంచి హాట్ క్రేజ్ తెచ్చుకుంది. ఈమె హీరోయిన్‌గా జూలీ-2 సినిమాలో నటిస్తోంది.