అంచనాలు పెంచిన యముడు-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య, శ్రుతి హాసన్, అనుష్క ప్రధాన తారాగణంగా తెలుగు, తమిళ భాషల్లో స్టూడియో గ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ అందిస్తున్న చిత్రం ‘యముడు 3’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ హారిస్ జయరాజ్ అందించిన ఆడియో సూపర్‌హిట్‌గా నిలిచిందని తెలిపారు. పవర్‌ఫుల్ పోలీసు పాత్రలతో దూసుకుపోతున్న సూర్య యముడు చిత్రాలకు కొనసాగింపుగా ‘ఎస్ 3’ వస్తోందని తెలిపారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే థ్రిల్లింగ్ కలిగించేలా పరుగులు పెట్టిస్తుందని, టీజర్స్ చూసిన తరువాత ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయని తెలిపారు. అనుష్క నటనకు శ్రుతి హాసన్ గ్లామర్ తోడవ్వడంతో ఈ చిత్రానికి మంచి మార్కెట్ లభిస్తోందన్నారు. నీతి నిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనే కథనంతో చిత్రం సాగుతుందని తెలిపారు.