విశాఖలో సందీప్ సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్, మెహ్రిన్ కౌర్ జంటగా తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సహ నిర్మాత రాజేష్ దండా వివరాలు తెలియజేస్తూ,‘నాపేరు శివ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సుశీంద్రన్ దర్శకత్వంలో అదే స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రమిది. భిన్నమైన కథనంతో రూపొందే ఈ చిత్రం యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. కబాలి చిత్రానికి పనిచేసిన యాక్షన్ టీమ్ అంబు, అరియులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. సందీప్ కిషన్ మధ్యతరగతి యువకుడిగా భిన్నమైన పాత్రతో ఆకట్టుకోనున్నాడు. ప్రస్తుతం వైజాగ్‌లో ప్రారంభించిన షెడ్యూల్‌లో సందీప్, మెహ్రిన్‌లపై ఓ పాటను చిత్రీకరించాం. ముప్పయిరోజులపాటు ఇక్కడే జరగనున్న ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్టింగ్ వేశాము. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమాన్ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.లక్ష్మణ్‌కుమార్, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: కాశీవిశ్వనాథం, సహ నిర్మాత: రాజేష్ దండా, సమర్పణ: శంకర్ చిగురుపాటి, నిర్మాత: చక్రి చిగురుపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుశీంద్రన్.