నువ్వు ఒరేయ్.. నేను ఒసేయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్ మహి, అశ్విని జంటగా శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై రిమ్మలపూడి వీరగంగాధర్ రూపొందిస్తున్న చిత్రం ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’. రవిచంద్ర కన్నికంటి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకులు వీరశంకర్, దేవిప్రసాద్, బాబ్జి, రావిపల్లి రాంబాబు సంయుక్తంగా సీడీని విడుదల చేశారు. సినిమా టైటిల్ కొత్తగా వుందని, పాటలు, ట్రైలర్స్ యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అతిథులు అన్నారు. లవ్‌లీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా, ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించామని దర్శకుడు రవిచంద్ర కన్నికంటి అన్నారు. దర్శకుడు కథ చెప్పినదానికన్నా బాగా తీశారని, ఆడియో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని, త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత వీరగంగాధర్ రిమ్మలపూడి తెలిపారు. పృధ్వీ, అప్పారావు, కేదార్ శంకర్, నిర్మల, రింగు రమేష్, గంగాధర్, రితిక, రాధ, ఉమ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:వాసు బొజ్జ, సంగీతం:సుమన్ జూపూడి, పాటలు:్ధరేందర్, ఎడిటింగ్:రవీంద్రబాబు.కె, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రవిచంద్ర కన్నికంటి.