ఉగాదికి కాటమరాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిశోర్ పార్థాసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను ఇటీవల విడుదల చేయగా మంచి ఆదరణ పొందుతున్నాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు. తాజాగా ఓ కొత్త లుక్‌ను మీడియాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేశామని, ఉగాదికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు. అలీ, నాజర్, రావురమేష్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, దర్శకత్వం:కిశోర్ పార్థాసాని.