వాస్తవ కథలకు మంచి రెస్పాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిన్నమైన సినిమాలు చేస్తూ హీరోగా రోజురోజుకూ తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటున్నాడు హీరో సూర్య. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘సింగం-3’. గతంలో వచ్చిన సింగం, సింగం- 2 సినిమాలు సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ఈనెల 9న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న సందర్భంగా హీరో సూర్య చెప్పిన విశేషాలు...
* మూడో సింగం ఎలా ఉంటుంది?
- సింగం సీక్వెల్స్‌లో మూడో సీక్వెల్ వాయిదా పడ్డట్టు మరే చిత్రం వాయిదా పడలేదు. ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడం, మరికొన్ని కారణాలతో సింగం-3ని వాయిదా వేసుకుంటూ వచ్చాం. 100 రోజుల తర్వాత ఈ నెల 9న విడుదలవుతోంది.
* ఆకట్టుకునే అంశాలు?
- నిజమైన పోలీస్ ఆఫీసర్ జీవితాలను ఆధారంగా చేసుకుని రాసిన కథ ఇది. సినిమాలో చూపినట్టు యాక్షన్ సీక్వెన్స్ రియల్ లైఫ్‌లో ఉండకపోవచ్చు. కానీ కథ మాత్రం మన సొసైటీలో పోలీసులను చూసి రాసుకున్నదే. పోలీస్ ఆఫీసర్లు కొన్ని కేసులను ఎలా హ్యాండిల్ చేస్తారనే దానిపై వారిని కలిసి వారితో మాట్లాడాం కూడా. సినిమాలో చూపించిన వాటిలో ఎనభై శాతం పాజిబిలిటీ వుంటుందని, నేను పోలీస్ పాత్రల్లో నటించిన కాక్క కాక్క, సింగం సీక్వెల్స్ సినిమాలను కొత్తగా సర్వీసులోకి రాబోయే పోలీస్ ఆఫీసర్స్‌కు చూపిస్తారని తెలిసింది.
* దర్శకుడు హరి గురించి?
- దర్శకుడు హరి డౌన్ టు ఎర్త్ పర్సన్. పెద్ద డైరెక్టర్ స్థాయికి ఎదిగినా ఇంకా ఆయన పడే కష్టం చూసి ఆశ్చర్యపోతాం. మూడు సినిమాల కష్టాన్ని సింగం -3 సినిమా కోసం పడ్డారు. 120 రోజుల్లో పూర్తిచేశారు. మామూలుగా సాధారణ డైరెక్టర్ అయితే రోజులో 30 సీన్స్ తీస్తాడు. కానీ హరి మాత్రం ఏకంగా 90 సీన్స్ తీయగలరు.
* సింగం-4 చేస్తున్నారా?
- ఆ ఆలోచనే లేదు. సింగం చేస్తున్నప్పుడు ఈ ఫ్రాంచైజీ వస్తుందని కూడా అనుకోలేదు. అసలు సింగం-3 చేయాలనే ఆలోచన లేదు. నేను, హరి మిలటరీ కథతో సినిమా చేయాలనుకున్నప్పుడు, కథ కోసం మూడు సిట్టింగ్స్ జరిగాయి. నేను, హరి ఎక్కడికి వెళ్లినా అందరూ ‘సింగం మూడో పార్ట్ చేస్తున్నారు కదా’ అని అడగడం ప్రారంభించారు. మా కాంబినేషన్‌లో వచ్చిన సింగంకు ఇంత ఆదరణ వచ్చినపుడు సింగం ఫ్రాంచైజి ఎందుకు చేయకూడదని సింగం-3 చేయడానికి నిర్ణయం తీసుకున్నాం.
* తెలుగులో స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు?
- ఈ విషయం నన్ను అడిగే కంటే దర్శకులను అడగడం బెటర్.
* తరువాతి సినిమాలు...?
- విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. తన టేకింగ్ బావుంది.

- శ్రీ