అది నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ నటుడు విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘్ధృవ నచ్చత్తిరం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. దీంతో విక్రమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఈనెల 10 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ మొదలవుతుంది. మొదట ఈ ప్రాజెక్టులో విక్రమ్ జోడీగా ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవిని అనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆమె ప్రాజెక్టునుండి తప్పుకున్నారు. తరువాత ఆమె స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందని వార్తలొచ్చాయి. వీటిపై స్పందించిన తమన్నా విక్రమ్ సినిమాలో నటిస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు. అలాగే సినిమా స్టోరీలైన్ కమర్షియల్ ఫార్మాట్‌లో చాలా బాగుందని, తన పాత్ర కూడా అద్భుతంగా ఉందని, కానీ ఇప్పుడే దాని గురించి ఏమీ చెప్పలేనని అన్నారు. అలాగే మార్చి నుండి షూట్లో పాల్గొంటానని, మొదటిసారి విక్రమ్‌తో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా వుందని అన్నారు.