శివరాత్రి కానుకగా యమన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ ఆంటోని కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవిందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం యమన్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, ‘నకిలీ’, ‘డా సలీం’, ‘బిచ్చగాడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని నటించిన మరో సూపర్‌హిట్ చిత్రం ఇదని, కథ, కథనాలు సరికొత్తగా సాగుతాయని, ఆయన అందించిన సంగీతంతోపాటు నటన కూడా హైలెట్‌గా వుంటుందని తెలిపారు. ఆడియోను విడుదల చేయనున్నామని, సినిమాను కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని ఆయన వివరించారు.