తిరుమల మహిమ తెలిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జున, దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై షిరిడీ సాయి నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథాచిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీతప్రియులను విశేషంగా అలరిస్తోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం వేంకటేశ్వరస్వామి, హధీరామ్‌బాబా మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈనెల 10న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ సూపర్‌హిట్ సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం ఏంటి అని చాలామంది అన్నారు. అసలు ఈ సినిమా ఒప్పుకుని చేయకపోతే ఇంకే సినిమా చేయాలి అని నేను అన్నాను. కమర్షియల్ సినిమా ఎప్పుడైనా చేయొచ్చు. ఆల్‌రెడీ 95 సినిమాలు చేశాను. ఈ సినిమా వెరీ స్పిరిచ్యువల్, బ్యూటీఫుల్ జర్నీ. ఇలాంటి అవకాశం రావడం చాలా చాలా కష్టం. ఈ సినిమా చేసేటప్పుడు ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. తిరుమలలో జరిగిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. తిరుమలకి ఎందుకు వెళ్లాలి, అక్కడ ఏం చేయాలి, అసలు దేవుడు వున్నాడా? లేడా? అనే విషయాలు పక్కనపెడితే దేవుడ్ని పూజించి ఆయనకి చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తే మనలో ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నమయ్య, శ్రీరామదాసు భక్తుల సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. సినిమా హాయిగా ఫినిష్ అయింది. నా కెరీర్‌లో ఈ సినిమా ది బెస్ట్ ఫిలిం అని గర్వంగా చెబుతున్నాను. సినిమా చూసే ప్రతి ఒక్కరి హార్ట్‌ని టచ్ చేస్తుంది. 7, 8 ఏళ్ల వయసులో ఒక మనిషి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆ మనిషి దేవుడ్ని చూడాలి అని గురువుని అడగడం, దానికోసం అతను ఎన్ని పనులు చేశాడు, ఎంత కష్టపడ్డాడు, చివరికి తిరుమలకి వెళ్లి దేవుడ్ని చూశాడా? లేదా అనేది చిత్ర కథ అని వివరించారు.
థియేటర్లన్నీ దేవాలయాలుగా
మారిపోతాయి : రాఘవేంద్రరావు
ప్రపంచంలో ఎన్ని పూలు ఉన్నాయో వాటన్నింటి గురించి వేదవ్యాస్ చక్కగా పాట రూపంలో రాశారని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. ‘్ఫబ్రవరి 10నుండి ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడే థియేటర్లన్నీ తిరుమల దేవాలయాలుగా మారిపోతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వరల్డ్‌వైడ్‌గా థియేటర్లు పుణ్యక్షేత్రాలుగా వెలగబోతున్నాయి. అనుష్క కృష్ణమ్మ పాత్రలో ‘వెయ్యి నామాలవాడా మూడు నామాలవాడా’ అనే పాటతో స్వామిని అనేక రకాలుగా సందర్శిస్తారు. హధీరాం బాబాగా నాగార్జున అద్భుతంగా నటించారు. ‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా’ పాటతో దేవుడి తలుపు తెరిచే సన్నివేశంలో నాగార్జున కళ్లలో వున్న పవర్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ ముఖ్యమైన పాత్రలో నటించారు. సౌరభ్‌జైన్ హిందీలో చాలా పాపులర్. అతను వేంకటేశ్వరస్వామిగా చేయడం సినిమాకి ఎంతో ప్లస్ అయింది. ఎంతోమంది భక్తులు ఉండగా వేంకటేశ్వరస్వామి హధీరామ్ బాబాతోనే ఎందుకు పాచికలు ఆడాడు. అతనికే ఎందుకు కనపడ్డాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా ఒక స్పిరిచ్యువల్ జర్నీగా సాగింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి, సౌరభ్‌జైన్, హీరోయిన్స్ విమలారామన్, అశ్విత, కథారచయిత జె.కె.్భరవి, పాటల రచయితలు వేదవ్యాస్, అనంత్ శ్రీరాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.విక్రంకుమార్, ఎడిటర్ గౌతంరాజు, కెమెరామెన్ ఎస్.గోపాల్‌రెడ్డి, కళా దర్శకుడు కిరణ్‌కుమార్ మనే్న పాల్గొన్నారు.