వినూత్న ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, తమన్నా, రాశీఖన్నా జంటగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ను ప్రారంభించారు. నిర్మాత మాట్లాడుతూ, ప్రమోషన్ పరంగా వినూత్నంగా ఈ చిత్రం కోసం పనిచేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక బస్సులపై ప్రమోషన్ మొదలుపెట్టామని, దాదాపు రెండు రాష్ట్రాల్లో కోటికిపైగా ప్రయాణికులు బస్ ప్రయాణం చేస్తున్నారని, వారిలో ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం గూర్చి తెలియాలనే ఉద్దేశ్యంతో సరికొత్తగా ప్రమోషన్ చేస్తున్నామని తెలిపారు. రవితేజ కెరీర్‌లో ఓ హయ్యెస్ట్ పవర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతుందని వారు తెలిపారు. బొమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, హర్షవర్థన్ రానె, పృధ్వీ, సురేఖావాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, రమాప్రభ, ప్రభ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సౌందర్ రాజన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:్భమ్స్, నిర్మాత:కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:సంపత్ నంది.