భయపెట్టనున్న కళావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన ‘అరన్మణి’ (చంద్రకళ) చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘అరన్మణి-2’ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో ‘కళావతి’గా విడుదల కానుంది. త్రిష, హన్సిక, సిద్దార్థ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్‌రామ్ క్రియేషన్స్ పతాకాలపై విడుదల కానుంది. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి హిప్‌హాప్ తమీజు సంగీతం అందించారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ, సుందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కళావతి’ పేరుతో విడుదల చేస్తున్నామని, హారర్ కామెడీ చిత్రాల్లోనే బాక్సాఫీస్‌ను షేక్‌చేసిన చిత్రమిదని, గుడ్ సినిమా గ్రూప్, సర్వంతరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. సిద్దార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బజ్వాల నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేసి పాటలని ఈనెల 3వ వారంలో విడుదల చేస్తామని అన్నారు. ఈనెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సమర్పణ:జివ్వాజి రామాంజయనేయులు, సంగీతం:తమీజు, నిర్మాతలు: గుడ్ ఫ్రెండ్స్, దర్శకత్వం:సుందర్.సి.