భక్తితత్వంతో ‘నీలంపాటి అమ్మోరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమన్ ప్రధాన పాత్రలో శ్యాం, శ్రీకీర్తిక హీరో హీరోయిన్లుగా నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా డిఐ, గ్రాఫిక్స్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా తోట కృష్ణ మాట్లాడుతూ- 700 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామంలో నీలంపాటి అమ్మవారు వెలసిందని, ఆ అమ్మ మహిమలు జీవిత కథతో ఈ సినిమా రూపొందించామని తెలిపారు. సుమన్ అమ్మవారి భక్తుడిగా నటించారని, ఇతర నటీనటుల నటన, గ్రాఫిక్స్, సంగీతం హైలెట్‌గా వుంటాయని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, ఐదు పాటలు భక్తితత్వంతో ఆకట్టుకుంటున్నాయని ఆడియో విన్నవారు చెబుతున్నారని ఆయన తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. బేబి వైష్ణవి, శ్రీలత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఘనశ్యామ్, సమర్పణ:ఎం.ఎస్.చౌదరి, నిర్మాత, దర్శకత్వం:తోట కృష్ణ.