యుకెలో తుదిమెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చివరి షెడ్యూల్ రేపటినుండి ముంబైలో మొదలుకానుంది. సినిమా మొదలై ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కాని, ఫస్ట్‌లుక్ కాని, చివరికి టైటిల్ కానీ ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. మహేష్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని హై క్వాలిటీతో రూపొందిస్తున్నారట. అది కూడా యుకెలో రూపొందిస్తున్నారని, 30 సెకండ్స్ ఉండే ఈ టీజర్‌తో సినిమాపై హైప్ పెంచేలా ఉంటుందని సమాచారం. ఉగాది సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట యూనిట్ సభ్యులు. ఈలోగా ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ కన్ప్‌ఫర్మ్ కానీ ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారో అనే ఆసక్తి కూడా మొదలైంది. మహేష్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్న ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది.