సింగం-3 అందరికీ నచ్చింది.. నటుడు అనూప్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన సింగం-3 తమిళులకు ఎంత బాగా నచ్చిందో, తెలుగు వారికి కూడా అంతకన్నా బాగా నచ్చిందని నటుడు అనూప్‌సింగ్ తెలిపారు. సూర్యు కథానాయకుడుగా స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ రూపొందించిన సింగం-3 విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ కలక్షన్లతో సాగుతోందని తెలియజేస్తూ అనూప్‌సింగ్ పలు విషయాలు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రాకముందు పైలెట్‌గా పనిచేశానని, స్టార్‌ప్లస్‌లో వచ్చే మహాభారతంలో ధృతరాష్ట్రుడిగా నటించానని తెలిపారు. మిస్టర్ ఇండియా, మిస్టర్ ఏషియా పోటీల్లో పాల్గొన్నానని, మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయుణ్ణి నేనేనని ఆయన అన్నారు. పూరి జగన్నాథ్ ‘రోగ్’ చిత్రంకోసం మెయిన్ విలన్‌గా తనను తీసుకున్నారని, ఆ తర్వాత సింగంలో నటించే అవకాశం దొరికిందని ఆయన తెలిపారు. సింగంతో ప్రేక్షకులకు పరిచయమైన తాను ఈ సినిమా విజయవంతమైనందుకు ఆనందంగా ఉన్నానని, ఈ చిత్రంకోసం తమిళం కూడా నేర్చుకున్నానని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రంలో తనను చూసి రిసీవ్ చేసుకున్న తీరు నచ్చిందని, తరువాత వస్తున్న చిత్రం ‘విన్నర్’లో కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతానని ఆయన తెలిపారు. ‘కమెండో-2’ చిత్రంలో కూడా నటించానని, విన్నర్‌లో హార్స్ రైడర్‌గా వైవిధ్యం వున్న పాత్రలో నటించానని ఆయన వివరించారు.