అభిమాని వివాహానికి తాప్సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటి, ప్రస్తుతం హిందీలో స్టార్ హీరోయిన్‌గా మన్ననలు పొందుతున్న తాప్సి తన అభిమాని విజ్ఞప్తిమేరకు అతని వివాహానికి హాజరుకానుంది. సికింద్రాబాద్‌కు చెందిన ఆ అభిమాని వివాహం వచ్చే నెలలో జరగనుంది. రెగ్యులర్‌గా ఈమెయిల్స్, చాటింగ్ ద్వారా టచ్‌లో ఉండే ఈ అభిమానికి తాప్సి అంటే ఎనలేని గౌరవమట. అంతేగాక అతను తాప్సి ఫాన్స్ క్లబ్‌లో అధికారిక సభ్యుడట. ఎప్పుడు తాప్సిని గౌరవ సూచకంగా మాట్లాడుతూ ఆమెతో చాలా సౌమ్యంగా ప్రవర్తిస్తుంటాడట. అందుకే అతనంటే తనకు కూడా అభిమానమని, అతను తన వివాహానికి రావలసిందిగా ఆహ్వానించాడని, ఓకే చెప్పానని, తన అభిమానికోసం ఒక రోజు కేటాయించి పెళ్లికి హాజరవుతానని అన్నారు తాప్సి. ఇకపోతే తాప్సి నటించిన తాజా చిత్రం ‘ఘాజి’ విడుదలై ఘన విజయం సాధించగా ఆమె నటించిన మరో హిందీ చిత్రం ‘రన్నింగ్ షాదీ.కామ్’కూడా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.