అదేం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ వైపు టాలీవుడ్, కోలీవుడ్, మరోవైపు బాలీవుడ్ అంటూ రకరకాల అవకాశాలతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి చక్కర్లు కొట్టేస్తోంది నటి శ్రుతిహాసన్. ఇంత బిజీలో కూడా అమ్మడిపై ఏవో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాటన్నిటినీ అసలు పట్టించుకోదనుకోండి! అయినా కానీ ఆమె పట్టించుకునేలా ఓ కొత్త కథనం వినిపిస్తోంది. అవేంటంటే తాజాగా లండన్‌లో నటుడైన మైఖేల్ కోర్సలేతో ఎయిర్‌పోర్టులో కనిపించింది ఈ భామ. దీంతో సహజంగానే రూమర్లు వస్తాయి కదా? అలాగే వచ్చేశాయి. మైఖేల్‌తో తాను డేటింగ్ చేస్తున్నానంటూ వచ్చిన వార్తలలో నిజం లేదని చెబుతోంది శ్రుతిహాసన్. అతనికి, తనకు జస్ట్ స్నేహం మాత్రమేనని, అందరూ అనుకుంటున్నట్టుగా ఏమీ లేదని మరీ మరీ చెబుతోంది. ఇలాంటి విషయాలను పట్టించుకోని శ్రుతిహాసన్, ఇలా మాటిమాటికీ అదే విషయాన్ని నొక్కివక్కాణిస్తుండడంతో వినే వారికి కూడా అబద్ధం చెబుతుందా అన్న అనుమానం వస్తోందట! గతంలో చెట్టపట్టాలతో ఇద్దరూ కలసి తిరిగిన సంగతి అలా పెట్టి, ఆమె చెబుతున్న విషయాలను పరిగణనలోకి తీసుకుని ఓకే నిజమే అనుకోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా తాను చెప్పిందే కరెక్ట్ అని, మీరు ఊహించుకున్నదంతా తప్పని గతంలో ఎంత మంది ఇలాంటి రూమర్లపై వ్యాఖ్యానించలేదు.